ఇకపై శ్రీవారి సేవలన్నింటికీ
చేనేత వస్త్రాలను వినియోగించనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్
కనుమూరి బాపిరాజు వెల్లడించారు. ఈ వస్త్రాలను ఆప్కో సంస్థ ద్వారా కొనుగోలు
చేయనున్నట్టు తెలిపారు.
ఈ అంశంపై ఆయన బుధవారం ఢిల్లీ మీడియాతో మాట్లాడుతూ... శ్రీవారి పూజలకు ఇక నుంచి రసాయన కలుషితాలు లేకుండా నేసిన వస్త్రాలనే వినియోగించాలని నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇందుకు ఏటా అయ్యే రెండు కోట్ల రూపాయల విలువ చేసే నగదు నేత కార్మికులకు అందితే భక్తులు ఇచ్చే విరాళాలు సైతం సద్వినియోగమౌతాయన్నారు.
ఇకపోతే.. తిరుమల తిరుగిరుల్లో అన్యమత ప్రచారం సాగకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యంగా, తితిదే సిబ్బందిని తొలుత చైతన్యవంతులు చేయాల్సి ఉందన్నారు. ఇటీవల ముగ్గురు తితిదే సిబ్బంది అన్యమత ప్రచారం చేస్తూ పట్టుబడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. భవిష్యత్‌లో ఇలాంటివి జరుగకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకోనున్నట్టు ఆయన తెలిపారు

No comments:
Post a Comment