‘నిత్య
కళ్యాణం పచ్చతోరణం’గా భాసిల్లుతున్న పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో
శ్రీవారికి ప్రతి నిత్యం ఏదో ఒక ఉత్సవం జరుగుతూనే ఉంటుంది. అలంకార
ప్రియుడైన ఆ శ్రీహరి ఏదో ఒక వాహనంలో తిరుమాడ వీధుల్లో విహరిస్తూ
భక్తకోటికి దివ్యదర్శనం ఇస్తుంటారు. కానీ స్వయానా బ్రహ్మదేవుడే స్వయంగా
జరిపించే ఈ సాలకట్ల బ్రె్మత్సవాలు ఎంతో విశిష్టతను సంతరించుకున్నారుు.
బ్రె్మత్సవ వైభవం...బ్రె్మండనాయకుని వైభోగాన్ని కన్నులారా తిలకిస్తే సమస్త
పాపవిముక్తులై , ధనధాన్య సమృద్దితో తులతూగుతారన్నది భక్తుల ప్రగాఢ
విశ్వాసం. సప్తగిరులలో కొలువైన కోనేటి రాయుని బ్రె్మత్సవాలకు సర్వం సిద్ధం
అరుు్యంది. బ్రహ్మాది దేవతలు కొలువై తొమ్మిది రోజుల పాటు నిర్వహించే
బ్రహ్మాండనాయకుని బ్రె్మత్సవాలు ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించేందుకు
తిరుమల-తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈనెల 29 నుంచి
అకో్టబరు 7వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి వార్షిక బ్రె్మత్సవాలకు బుధవారం
అంకురార్పణ గావించనున్నారు.
తిరుమలేశుని బ్రహ్మోత్సవాలలో చివరిదైన చక్రస్నానం శ్రవణా నక్షత్రానికి ముందు వచ్చేలా తిధులు నిర్ణయించారు. అంకురార్పణం పుట్టమట్టిని తెచ్చి మేదిని, రాక, సినివాలి, అనుపేర మూడింటిని నాలుగు దిక్కులలో 12 పాలికలలో ఉంచి నవధాన్యా లు నింపి, మొలకెత్తడానికి సిద్ధం చేయడమే అంకురార్పణం. 29న బ్రహ్మోత్సవాలకు సృష్టిలో అందరినీ ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణం గురువారం సాయం సంధ్యవేళలో 5.30 నుంచి 6 గంటల లోపు గరుడ పటాన్ని మీనలగ్నం నందు ఎగురవేయనున్నారు. దీంతో బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం పలుకుతూ ప్రారంభం కానున్నాయి.
బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు...
- సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు తితిదే అన్ని ఏర్పాట్లను చేపట్టింది. వాహన సేవలను వీక్షించేందుకు వీలుగా తిరు వీధుల్లో ప్రత్యేక గ్యాలరీల ఏర్పాటు.
- తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లేందుకు నిముషానికి రెండు బస్సులను ఆర్‌టిసి ఏర్పాటు చేస్తున్నది.
- గరుడ సేవ రోజున 5 లక్షల మంది విచ్చేస్తారని తితిదే అంచనా.
- గరుడసేవకు ద్విచక్రవాహనాలను రద్దుచేస్తున్నట్లు ఛైర్మన్ స్పష్టం.
- భక్తులకు విరివిగా ప్రసాదాలను అందించేందుకు 5 లక్షల లడ్డూల నిల్వ.
- విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు... సుప్రభాత సేవ మినహా ఆర్జిత సేవలన్నీ రద్దు.
- వ్యక్తిగత భద్రత కోసం గరుడ సేవ రోజున ద్విచక్ర వాహనాల రద్దు.
- భారీ భద్రత నడుమ బ్రహ్మోత్సవాలు... 3500 మంది పోలీసులతో బందోబస్తు.
- 66 ప్రాంతాల్లో సిసి కెమేరాల ఏర్పాటు.
- ఘాట్ రోడ్డులో 24 గంటలు వాహనాల అనుమతి.
- పుష్కరిణిలోని నీరావళి మండపానికి స్వర్ణాలంకరణ పెయింటింగ్.
- తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయంలో భక్తులకు నిర్విరామంగా అన్నప్రసాద వితరణ
- తలనీలాల సమర్పించేందుకు కల్యాణకట్టలో అదనపు సిబ్బంది నియామకం.
- భక్తులను ఆకట్టుకునే విధంగా ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు.
- మూడు అదనపు కళ్యాణ కట్టలు
- మంగళం, బైరాగిపట్టెడ, ఎస్వీయూ ప్రాంతాల్లో ఆర్టీసీ కౌంటర్లు
- వేదిక్ వర్సిటీ వద్ద ప్రైవేటు బస్సుల పార్కింగ్
- కొండపై జిఎన్‌సి టోల్‌గేటు వద్ద అదనపు బస్సులు/li>
నడిచివచ్చే భక్తులే నిజమైన వివిఐపిలు...
ప్రప్రధమంగా స్వామివారి సేవకుడిగా సేవచేసే భాగ్యం స్వామివారు కల్పించడం నా పూర్వ జన్మసుకృతం... భక్తి శ్రద్ధలతో... అధికారుల అను భవంతో, పాత్రికేయుల సహా య సహకారాలతో ఈబ్రహ్మో త్సవాలను అత్యంత వైభవం గా నిర్వహించనున్నట్లు తిరు మల తిరుపతి దేవస్థానం పాలకమండలి అధ్యక్షులు కనుమూరిబాపిరాజు పేర్కొన్నారు. ఆయన ‘మేజర్‌న్యూస్’తో మాట్లాడుతూ దేవుని ముందు అందరూ సమానమే . ఈ బ్రహ్మోత్సవాలు దేవునిమీద విశ్వాస సంతోషంతో నిర్వహించనున్నట్లు తెలిపారు. నేను నియంతను కాదు ప్రతి ఒక్కరి సూచనలు, సలహాలు స్వీకరించే శ్రీవారి సేవకుడనని అన్నారు. విఐపి దర్శనాలను రద్దుచేస్తున్నట్లు తెలిపారు. విఐపిలు అంటరానివారు కాదని, వారూ భక్తులేనన్నారు. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి నడిచివచ్చే భక్తులే నిజమైన వివిఐపిలు అని చెప్పారు. శ్రీవారి మెట్టు, అలిపిరి కాలిబాట మార్గాల్లో నడిచివచ్చే భక్తులు అడుగడుగునా గోవిందుని స్మరించుకుంటూ విచ్చేస్తారు. వారికి ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు తెలిపారు. దివ్యదర్శనంలో దర్శనం, అనంతరం ప్రతి ఒక్క భక్తునికి శ్రీవారి ప్రతిమ గల ఫొటో వితరణ ఇవ్వనున్నట్లు తెలిపారు.
బ్రహ్మోత్సవాల వాహన సేవలు...
28న అంకురార్పణం - రాత్రి 7 నుంచి 8 గంటల వరకు
29న సాయంత్రం ధ్వజారోహణం - రాత్రి పెద్దశేష వాహనం
30న ఉదయం చిన్నశేష వాహనం - రాత్రి పెద్దశేష వాహనం
అక్టోబరు 1న ఉదయం సింహ వాహనం - రాత్రి ముత్యపు పందిరి వాహనం
2న ఉదయం కల్పవృక్ష వాహనం - రాత్రి సర్వభూపాల వాహనం
3న ఉదయం మోహినీ అవతారం - రాత్రి గరుడ సేవ
4న ఉదయం హనుమంతు వాహనం - సాయంత్రం స్వర్ణరథం, రాత్రి గజవాహనం
5న ఉదయం సూర్యప్రభ వాహనం - రాత్రి చంద్రప్రభ వాహనం
6న ఉదయం రథోత్సవం - రాత్రి అశ్వవాహనం
7న ఉదయం పల్లకీ ఉత్సవం, చక్రస్నానం - రాత్రి బంగారు తిరుచ్చి, ధ్వజ అవరోహణం
లోకానికి దివ్యోత్సవం...
శ్రీవారి బ్రహ్మోత్సవం.. లోకానికి దివ్యోత్సవం.... ప్రతి ఒక్కరూ ఆ బ్రహ్మోండనాయకుని బ్రహ్మోత్సవ వైభవాన్ని కన్నులారా వీక్షించి తరించేలా అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని తితిదే కార్యనిర్వహణాధికారి లంకావెంకటర సుబ్రమణ్యం తెలిపారు. ఆయన ‘మేజర్‌న్యూస్’తో మాట్లాడుతూ గతంలో భక్తుడిగా స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నానని తన పాతజ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. స్వామి సేవకునిగా బ్రహ్మోత్సవాలను నిర్వహించే భాగ్యం తనకు రావడం అదృష్టమన్నారు. గతంలో జరిగిన బ్రహ్మోత్సవాల్లో లోటుపాట్లను వివిధ శాఖల అధికారులు, సిబ్బంది ద్వారా తెలుసుకున్నామని, అవి ప్రస్తుతం జరుగనున్న బ్రహ్మోత్సవాల్లో జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు. కాలిబాటలో నడచివచ్చే భక్తులకు ఉచిత అన్నప్రసాదాన్ని అందివ్వనున్నట్లు తెలిపారు. దర్శనానికి వెళ్లే క్యూలైన్లవద్ద అదనపు కొలాయిలు ఏర్పాటు చేశామన్నారు. స్వామివారి వాహన సేవలలో చిల్లర నాణ్యాలను విసరద్దని భక్తులను కోరారు. భక్తులకు సేవలు అందించేందుకు ఈ ఏడాది శ్రీ సత్యసాయి సేవా సమితి వాలంటీర్లు వస్తున్నారని చెప్పారు. తితిదే ఉద్యోగులు, సేవకులు ఎవ్వరైనా భక్తులకు ఇబ్బందులు కల్పించేలా ప్రవర్తించరాదని సూచించారు. గరుడోత్సవం రోజు 5 లక్షల మంది భక్తులు వస్తారనే అంచనాలు వేశామని దానికి అనుగుణంగా ఆర్టీసీ బస్సు సర్వీసులు, కొండపై ఉ చిత బస్సులు, భారీ భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు
No comments:
Post a Comment